New Year Celebrations: న్యూ ఇయర్ వేళ.. మందుబాబులకు ఫ్రీ
ABN , Publish Date - Dec 31 , 2025 | 09:47 AM
మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. యువత నుంచి వయస్సు మళ్లీన వారు వరకు అంతా ఈ వేడుకల్లో మునిగిపోతారు. అందులో కొందరు మద్యం మత్తులో మునిగి తేలుతారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. యువత నుంచి వయస్సు మళ్లీన వారు వరకు అంతా ఈ వేడుకల్లో మునిగిపోతారు. అందులో కొందరు మద్యం మత్తులో మునిగి తేలుతారు. అలాంటి వారు మద్యం మత్తులో స్వయంగా ఇంటికి వెళ్లలేని వారు తమకు కాల్ చేస్తే ఉచితంగా ఇంటికి చేరవేస్తామని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్స్ వర్కర్స్ యూనియన్ ( టీజీపీడబ్ల్యుయూ) వెల్లడించింది. ఈ నెంబర్ 8977009804 కు కాల్ చేస్తే ఉచిత రైడ్ సౌకర్యాన్ని అందజేస్తామని స్పష్టం చేసింది. మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు వివరించింది.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.00 గంటల నుంచి జనవరి 1వ తేదీ రాత్రి 1.00 గంట వరకు ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. గత ఎనిమిదేళ్లుగా న్యూ ఇయర్ వేళ.. రాత్రుల్లో ఈ తరహా ఉచిత రైడ్స్ సేవలు అందిస్తున్నట్లు టీజీపీడబ్ల్యూయు గుర్తు చేసింది. మద్యం తాగి వాహనం నడపలేని వారి కోసం మొత్తం 500 వాహనాలు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పింది. అందుకోసం క్యాబ్‌లు, ఆటోలు, ఈవీ బైక్‌లు అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. #HumAapkeSaathHai ప్రచారం కింద ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెన్షన్ లబ్ధిదారులకు తీపి కబురు.. నేటి నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ద్రాక్షారామ ఘటనపై మంత్రితో మాట్లాడిన సీఎం
For More TG News And Telugu News