Gachibowli: తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
ABN , Publish Date - Oct 18 , 2025 | 09:12 AM
గచ్చిబౌలిలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. గచ్చిబౌలి TNGO'S కాలనీలో వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలి నానక్ రామ్ గూడాలోని ప్రభుత్వ పాఠశాలలో బోయిని పరమేశ్వర్ ఇద్దరు కుమారులు చదువుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 18: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. గచ్చిబౌలిలో ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. గచ్చిబౌలి TNGO'S కాలనీలో వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలి నానక్ రామ్ గూడాలోని ప్రభుత్వ పాఠశాలలో బోయిని పరమేశ్వర్ ఇద్దరు కుమారులు చదువుతున్నారు. ఇదే పాఠశాలలోని అంగన్వాడీలో చిన్న కుమారుడు నిఖిల్ తేజ్(4) చదువుతున్నారు. మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో పిల్లలను ఇంటికి తీసుకురావడానికి ఆటో డ్రైవర్ వచ్చాడు. పాఠశాల వద్ద కేవలం ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడని తండ్రి బోయిని పరమేశ్వర్ కు ఆటో డ్రైవర్ తెలిపాడు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. పాఠశాలకు చేరుకుని నిఖిల్ తేజ్ కోసం గాలించారు. పాఠశాల వెనుక వైపు ఉన్న నీటి సంపులో బాలుడు పడి ఉండటాన్ని గుర్తించారు. బాలుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయమై గచ్చిబౌలి పోలీసులకు తండ్రి బోయిని పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Telangana bandh over BC reservations: తెలంగాణ బంద్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు
Liquor Shop Tender: నేటితో ముగియనున్న మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు..