Liquor Shop Tender: నేటితో ముగియనున్న మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు..
ABN , Publish Date - Oct 18 , 2025 | 08:42 AM
తెలంగాణలో మద్యం టెండర్లకు అనూహ్యంగా స్పందన తగ్గింది. ఈసారి మద్యం దుకాణాలకు ఆశించినస్థాయిలో దరఖాస్తులు రావడం లేదని అధికారులు వాపోతున్నారు. దరఖాస్తుల గడువు ముగింపు దశకు వచ్చిన ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తుల దాఖలు గడువు నేటి(శనివారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 దుకాణాలకు 4,319 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిలో మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాలకు 800 దరఖాస్తులు, సంగారెడ్డి జిల్లాలో 101 దుకాణాలకు 2270 దరఖాస్తులు, సిద్దిపేట జిల్లాలో 93 దుకాణాలకు 1249 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
అయితే తెలంగాణలో మద్యం టెండర్లకు అనూహ్యంగా స్పందన తగ్గింది. ఈసారి మద్యం దుకాణాలకు ఆశించినస్థాయిలో దరఖాస్తులు రావడం లేదని అధికారులు వాపోతున్నారు. దరఖాస్తుల గడువు ముగింపు దశకు వచ్చిన ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీని కోసం దరఖాస్తులు పెంచేందుకు గాను... గతంలో లైసెన్సులు పొందిన వారికి స్వయంగా సందేశాలు పంపి మరీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ గడువు నేటి(శనివారం)తో ముగియనుంది. అయితే గత ఏడాది మద్యం దుకాణాల కోసం ఏకంగా 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి ఆ సంఖ్య దారుణంగా పడిపోయింది. మద్యం వ్యాపారంపై ఆసక్తి తగ్గడానికి పలు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మందగించడం, ఇతర వ్యాపారాలు ఆశాజనకంగా లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. దీనికి తోడు, కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి పోటీని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే దరఖాస్తులు తక్కువగా వేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
PM Janman Awards: రాష్ట్రానికి పీఎం జన్‌మన్ అవార్డులు
ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్ ప్రయోగం