Share News

Bhupathiraju Srinivasa Varma: మోదీ వికసిత్ భారత్, చంద్రబాబు విజన్ ఆంధ్రతో మంచి ఫలితాలు..

ABN , Publish Date - Oct 18 , 2025 | 09:13 AM

కేఎల్ యూనివర్సిటీ నుంచి లాంచ్ అవుతున్న శాటిలైట్లు వాతావరణం, ఓజోన్ పొర, హెల్త్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి డేటా అందిస్తాయని భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు విజన్ ఆంధ్ర.. కలిసి మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

Bhupathiraju Srinivasa Varma: మోదీ వికసిత్ భారత్, చంద్రబాబు విజన్ ఆంధ్రతో మంచి ఫలితాలు..
Bhupathiraju Srinivasa Varma

అమరావతి: కేఎల్ విశ్వవిద్యాలయం నుంచి మూడు శాటిలైట్లు లాంచ్ కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల నైపుణ్యం.. సృజనాత్మకత ఎలాంటిదో శాటిలైట్లు తెలియజేస్తాయని తెలిపారు. విద్యార్థులు రెండేళ్ల క్రితమే.. కేఎల్‌శాట్ 1 లాంచ్ చేశారని గుర్తు చేశారు. ఇవాళ(శనివారం) లాంచ్ చేసిన కాన్‌శాట్, ఇస్రో సహకారంతో లాంచ్ అయిందని పేర్కొన్నారు.


కేఎల్ యూనివర్సిటీ నుంచి లాంచ్ అవుతున్న శాటిలైట్లు వాతావరణం, ఓజోన్ పొర, హెల్త్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి డేటా అందిస్తాయని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు విజన్ ఆంధ్ర.. కలిసి మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి కళాశాల ప్రయోగశాలగా మరాల్సిన అవసరం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కాలేజీ, యూనివర్సిటీలో ప్రయోగాలు జరగాలని సూచించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలన్నారు. భారత్ టెక్నాలజీలో అనేక దేశాలతో పోటీ పడుతోందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు.


Also Read:

ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. తుపాకి, బుల్లెట్లు స్వాధీనం

హాస్టళ్ల విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

Updated Date - Oct 18 , 2025 | 09:13 AM