Share News

Police Operation: ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. తుపాకి, బుల్లెట్లు స్వాధీనం

ABN , Publish Date - Oct 18 , 2025 | 07:04 AM

జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు నెరుపుతూ పాకిస్థాన్‌ ఉగ్ర వాట్సాప్‌ గ్రూపుల్లో చురుగ్గా ఉంటున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్‌ మహమ్మద్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన...

Police Operation: ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. తుపాకి, బుల్లెట్లు స్వాధీనం

పుట్టపర్తిరూరల్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు నెరుపుతూ పాకిస్థాన్‌ ఉగ్ర వాట్సాప్‌ గ్రూపుల్లో చురుగ్గా ఉంటున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్‌ మహమ్మద్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సజ్జాద్‌హుస్సేన్‌, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్‌ ఆలంషేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఎస్పీ సతీష్ కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 16న నూర్‌ మహమ్మద్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా సజ్జాద్‌ హుస్సేన్‌, తౌఫీక్‌ఆలంషేక్‌.. జైషే మహమ్మద్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర నాయకులతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఉత్తరప్రదేశ్‌ పోలీసులతో కలిసి ఆమ్రోహా జిల్లా జంపార్వ ప్రాంతంలో సజ్జాద్‌ హుస్సేన్‌ ఆరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, జిహాదీ సాహిత్యం, అతని బంధువు నుంచి సింగిల్‌ బ్యారెల్‌ తుపాకి, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నానరు. అదేరోజు మహారాష్ట్ర ఏటీఎస్‌ బృందాల సహకారంతో నాసిక్‌, మలేగావ్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి, తౌఫీక్‌ ఆలం షేక్‌ను అరెస్టు చేశారు. రెండు సెల్‌ఫోన్లు, 27 బుల్లెట్లు, జిహాదీ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Oct 18 , 2025 | 07:05 AM