నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:30 PM
వాక్ స్వాతంత్య్రం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. అయితే ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అమరావతి, జులై 21 (ఆంధ్రజ్యోతి): వాక్ స్వాతంత్య్రం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) వ్యాఖ్యానించారు. అయితే ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికల విస్తరణతో కొందరు అసత్య ప్రచారాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు ( మంగళవారం) ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీ ట్రీట్ టుడేస్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత పాల్గొని మాట్లాడారు.
ఈగల్ ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చాం..
రెండు రోజుల పాటు ఈ వర్క్‌షాప్ జరుగుతుందని.. రేపటి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారని హోం మంత్రి అనిత తెలిపారు. మీ సలహాలు, సూచనలు సీఎంకు ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వివిధ విభాగాలు అన్ని ఒకేచోట చేర్చామని వెల్లడించారు. ఈరోజు జరుగుతున్న రీట్రీట్ ఫ్యూచర్ రెడీ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. మహిళల మీద జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. గంజాయిని అరికట్టడం కోసం ఈగల్ ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చామని ప్రస్తావించారు.
గంజాయి సాగును అరికట్టాం..
పోలీసుల సహకారంతో గంజాయి సాగును అరికట్టామని హోం మంత్రి అనిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న నాయకుడని చెప్పుకొచ్చారు. 2028 నాటికి 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఆయన పూర్తి చేసుకుంటారని తెలిపారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరేం చెప్పిన చంద్రబాబు వింటారని అన్నారు. 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆయన ఎంతోమంది పోలీస్ అధికారులతో పని చేశారని ప్రస్తావించారు. సైబర్ క్రైమ్స్‌ను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేరాల నియంత్రణ కోసం సీఎం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నారని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు: హోం మంత్రి అనిత
ఆ సమయంలో రూ.40ల జీతానికి పనిచేశా: మంత్రి నారాయణ
అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News