ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:05 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 1వ తేదీన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
విజయనగరం జిల్లా, జులై 20 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆగస్టు 1వ తేదీన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లను అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు.
వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు హోం మంత్రి కీలక సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో స్వాగత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రధాని పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు హోం మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పీవీ సింధు విజయం.. భారత క్రీడా చరిత్రలో మరో మైలురాయి: పవన్ కల్యాణ్
ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అయోధ్య విరాళాల వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News