అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి
ABN , Publish Date - Jul 20 , 2026 | 09:54 AM
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా, జులై 20 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి (MLA Galla Madhavi) డిమాండ్ చేశారు. ఆధారాలు చూపకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈరోజు (సోమవారం) గుంటూరు జిల్లాలో మాధవి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమని మాధవి పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనమని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని అన్నారు. మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజీ ఉండబోదని గళ్లా మాధవి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పీవీ సింధు విజయం.. భారత క్రీడా చరిత్రలో మరో మైలురాయి: పవన్ కల్యాణ్
ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అయోధ్య విరాళాల వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News