Share News

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ కీలక ప్రాజెక్టులపై చర్చ

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:57 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(బుధవారం) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తీన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు.

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ కీలక ప్రాజెక్టులపై చర్చ
AP CM Chandrababu Naidu

ఢిల్లీ, జులై 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (బుధవారం) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తీన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ఆయా సమావేశాల్లో ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై సీఎం చర్చించనున్నారు.


మరి కాసేపట్లో ప్రధాని నరేంద్రమోదీతో సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే, కేంద్రమంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్‌, మనోహర్ లాల్ ఖట్టర్‌, సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు. విభజన హామీల అమలు, నిధుల విడుదలపై అమిత్‌షాతో చర్చించనున్నారు. ఏపీకి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై పీయూష్ గోయల్‌తో మాట్లాడనున్నారు. ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన నిధులపై కేంద్రప్రభుత్వ సాయం గురించి మనోహర్ లాల్ ఖట్టర్‌‌కు వివరించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులు, పనుల పురోగతి, ఏపీలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపై సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మూడువేల కుటుంబాలకు ఇంటి పట్టాలు అందజేసిన మంత్రి లోకేశ్

నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: హోం మంత్రి అనిత

తమ్మినేని సీతారం భూ అక్రమాలపై చర్యలుంటాయి: మంత్రి అనగాని

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 12:09 PM