Home » Rampachodavaram
పోలవరం జిల్లాలోని జాగరంపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలిసి వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు తాను మాట ఇచ్చానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పోలవరం జిల్లా రంపచోడవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హైస్కూలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లితండ్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహార శైలి తలనొప్పిగా మారింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రచ్చ రచ్చ చేసింది. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ల వ్యవహారం ట్రెండింగ్ అయింది. ఇది కాస్త మరుగున పడిందని అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో ఎమ్మెల్సీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల ఓట్లను సైతం మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఉదయం 8.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.