దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం
ABN , Publish Date - Jul 23 , 2026 | 09:03 AM
తిరుమలలోని ఆంజనేయస్వామి విగ్రహ అపహరణ కేసును 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు.
అమరావతి, జులై 23 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని ఆంజనేయస్వామి విగ్రహ అపహరణ కేసును 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) అభినందించారు. వేగవంతమైన దర్యాప్తుతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, అపహరించిన విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం పోలీసుల సమర్థతకు నిదర్శనమని ప్రశంసించారు.
తిరుమల వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని మంత్రి ఆనం పేర్కొన్నారు. తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయాల్లో సీసీటీవీ నిఘా, భద్రతా సిబ్బంది పర్యవేక్షణ, ఆధునిక భద్రతా చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
దేవతా విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ కీలక ప్రాజెక్టులపై చర్చ
తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై విచారణ చేస్తున్నాం: అచ్చెన్నాయుడు
ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News