Share News

సింగర్ గొప్ప మనసు.. రూ. 40కే తిన్నంత భోజనం..

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:41 PM

ప్రముఖ సింగర్ ఆర్జిత్ సింగ్ పశ్చిమ బెంగాల్‌లోని తన స్వస్థలం జియాజంగ్‌లో ‘హేషెల్’ పేరుతో ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్నారు. వెజ్ భోజనం.. అది కూడా ఫుల్ మీల్స్ కేవలం రూ.40లకే అందిస్తున్నారు..

సింగర్ గొప్ప మనసు.. రూ. 40కే తిన్నంత భోజనం..
Arijit Singh restaurant

ఇంటర్‌నెట్ డెస్క్: సింగర్ ఆర్జిత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీతో పాటూ తెలుగులోనూ చాలా హిట్ సాంగ్స్ పాడాడు. 2010లో విడుదలైన ‘కేడీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. చివరగా 2024లో విడుదలైన ‘ఓం భీమ్ బుష్’ సినిమాలో ‘అణువణువూ’ పాట పాడాడు. ప్లే బ్యాక్ సింగర్‌గా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏమైందో ఏమో తెలీదు కానీ.. ప్లే బ్యాక్ సింగింగ్‌కు ఆర్జిత్ సింగ్ గుడ్‌ బై చెప్పేశాడు. ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా అతడ్ని ప్రాథేయపడుతున్నారు.


రూ. 40కే తిన్నంత భోజనం..

ఆర్జిత్ సింగ్‌ భోజన ప్రియుడు. 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను నాన్ వెజిటేరియన్‌ను. కానీ, వెజిటేరియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్‌లో చికెన్ బాగా తింటాను. చికెన్‌తో పాటూ వెజిటేరియన్ కర్రీలు కూడా ఉండాల్సిందే. ఇంటి భోజనాన్ని బాగా ఇష్టపడతాను. లంచ్‌లో ఎక్కువగా పప్పు, ఏదైనా కర్రీ తింటాను’ అని అన్నారు. భోజనం మీద ఆయనకున్న ఇష్టం కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని తన స్వస్థలం జియాజంగ్‌లో ‘హేషెల్’ పేరుతో ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేసి.. తక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్నారు.


సాధారణంగా వెజ్ భోజనం ధర.. చిన్న చిన్న హోటళ్లలో అయినా మినిమం రూ. 80 నుంచి రూ. 150 వరకు ఉంటుంది. అయితే, ఆర్జిత్ సింగ్ హోటల్‌లో మాత్రం వెజ్ భోజనం.. అది కూడా ఫుల్ మీల్స్ కేవలం రూ.40లకే అందిస్తున్నాడు. ఇక్కడ మరో గొప్ప విషయం ఏంటంటే.. స్టూడెంట్స్‌కు కేవలం రూ.30లకే ఫుల్ మీల్స్ పెడుతున్నాడు. తక్కువ ధర కదా అని అన్నం, పప్పుతో సరి పెట్టడం లేదు. మెను చాలా పెద్దగానే ఉంటుంది. అన్నం, పచ్చడి, పప్పు, మూడు కర్రీలు, సలాడ్ ఉంటాయి. పేద, మధ్య తరగతి వారిని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత్ సింగ్ తక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆస్ట్రేలియా ఓపెన్ 2026.. ఫైనల్లో అడుగు పెట్టిన అల్కరాజ్

బడ్జెట్ 2026: ఆదివారం రోజే ఎందుకు? ఆ రోజు స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి.?

Updated Date - Jan 30 , 2026 | 05:49 PM