ఆస్ట్రేలియా ఓపెన్ 2026.. ఫైనల్లో అడుగు పెట్టిన అల్కరాజ్
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:25 PM
ఆస్ట్రేలియా ఓపెన్ 2026 తుది దశకు చేరుకుంది. స్పెయిన్ సంచలనం, ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ఓపెన్ 2026 తుది దశకు చేరుకుంది. స్పెయిన్ సంచలనం, ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్(Australian Open 2026)లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 6-4, 7-6(5), 6-7(3), 6-7(4), 7-5 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను అల్కరాజ్ గెలుచుకున్నప్పటికీ.. జ్వెరెవ్ గట్టి పోటీనిస్తూ తర్వాతి రెండు సెట్లను టై బ్రేకర్లలో సొంతం చేసుకున్నాడు. దీంతో విజేతను తేల్చేందుకు ఐదో సెట్‌ను నిర్వహించారు.
అయితే ఈ మ్యాచ్ మూడో సెట్‌లో అల్కరాజ్(Carlos Alcaraz) కుడి కాలికి తీవ్ర గాయమైంది. ఒకానొక దశలో కదలడానికి కూడా ఇబ్బంది పడిన అల్కరాజ్.. మ్యాచ్ మధ్యలోనే వైదొలుగుతాడనే అంతా భావించారు. కానీ అల్కరాజ్ మాత్రం అద్భుతమైన పోరాటం కనబరిచాడు. మెడికల్ టైం అవుట్ తీసుకుని తిరిగి కోర్టులో అడుగుపెట్టాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో 3-5తో అల్కరాజ్ వెనుకబడినప్పటికీ.. తర్వాత తన మార్క్ షాట్లతో పుంజుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అల్కరాజ్.. రెండు సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సినర్ లేదా నోవాక్ జోకోవిచ్‌లతో తలపడే అవకాశముంది. మరోవైపు సెకెండ్ సెమీఫైనల్లో శనివారం జానిక్ సినర్, జోకోవిచ్‌లు తలపడనున్నారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా