Home » Tennis
అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో పునరాగమనం చేస్తున్నారు. జనవరిలో ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం ఆమెకు ఇప్పటికే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది.
2025.. ముగింపుకి వచ్చేసింది. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. క్రీడా రంగంలో సీనియర్లకు ధీటుగా ఎంతో మంది యువ సంచలనాలను ఈ ఏడాది మనందరికి పరిచయం చేసింది. స్వర్ణ పతకాలను దేశానికి అందించిన వారెవరో.. వారు సాధించిన ఘనతలేంటో చూద్దాం..
సానియా స్నేహితురాలు ఫరా ఖాన్ హోస్ట్ చేసిన షో ‘సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా’ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించింది. సింగిల్ మదర్‌గా బతకడం చాలా కష్టమని తెలిపింది.
ఇండియా టాప్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్‌కు చుక్కెదురైంది. అతడు చైనాలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్-2026కు అర్హతగా భావించే వైల్డ్‌కార్డ్ ప్లేఆఫ్‌లో ఆడేందుకు అక్కడకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీసాకు దరఖాస్తు చేసుకోగా.. డ్రాగన్ దేశం తిరస్కరించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్న ప్రతిస్పందనలు వస్తున్నాయి.
భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన ఆటకు శనివారం రిటైర్‌మెంట్ ప్రకటించాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా టెన్నిస్‌లో తన ప్రయాణం గురించి స్మరించుకున్నాడు.
అత్యంత ఆసక్తికరంగా సాగిన యూఎస్ ఓపెన్‌లో బెలారస్ క్రీడాకారిణి అర్యనా సబలెంక విజేతగా నిలిచింది. అమెరికాకు చెందిన అనిసిమోవాపై 6-3, 7-6 (3)తో వరుస సెట్లలో విజయాలు సాధించిన సబలెంక విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
మరి కాసేపట్లో యూఎస్ ఓపెన్‌లో ఉత్కంఠ భరిత పోరు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 12.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఏడో సీడ్ జొకో, రెండవ సీడ్ అల్కారజ్ ఢీ అంటే ఢీ అననున్నారు.
యూఎస్ ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోలెండ్ భామ ఇగా స్వియటెక్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది..
హరియాణా టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్‌పై దీపక్ యాదవ్ గత గురువారంనాడు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీపక్ యాదవ్ స్వయంగా తన నేరం ఒప్పుకోవడంతో కోర్టు ఒకరోజు పోలీసు కస్టడీ, అనంతరం జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది.
డబుల్ డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కారజ్ వరుసగా మూడో వింబుల్డన్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు.