US Open Djokovic Vs Alcaraz: సెమీస్‌లో తలపడనున్న జొకో, అల్కారజ్.. అభిమానుల్లో ఉత్కంఠ
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:38 PM
మరి కాసేపట్లో యూఎస్ ఓపెన్‌లో ఉత్కంఠ భరిత పోరు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 12.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఏడో సీడ్ జొకో, రెండవ సీడ్ అల్కారజ్ ఢీ అంటే ఢీ అననున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ ఓపెన్‌లో ఉత్కంఠ భరిత పోరు కాసేపట్లో ప్రారంభం కానుంది. 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటలో ఉన్న సెర్బియా యోధుడు నోవాక్ జొకోవిచ్, స్పెయిన్ యువ కెరటం అల్కారజ్ మధ్య సెమీస్ మ్యాచ్.. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 12.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అభిమానులు మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడో సీడ్ జొకో, రెండవ సీడ్ అల్కారజ్ మధ్య పోరులో గెలుపెవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది (Djokovic Vs Alcaraz US Open 2025).
జోరు మీదున్న జొకో ఇప్పటికే పలువురు దిగ్గజాలను మట్టి కరిపించి సెమీస్‌లో కాలుపెట్టాడు. మరోవైపు, అల్కారజ్ కూడా దూకుడుగా ఆడుతూ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాడు. అయితే, జొకో, అల్కారజ్ నేరుగా తలపడిన గత 8 సందర్భాల్లో ఐదు పర్యాయాలు జొకోవిచ్ విజయం సాధించాడు. ఈ ఐదు విజయాల్లో నాలుగింటిని గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్‌లోనే దక్కించుకున్నాడు (Grand Slam semifinal clash).
గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో కూడా ఈ ఇద్దరు దిగ్గజాలు ఢీ అంట ఢీ అంటూ తలపడ్డారు. కానీ రెండు సెట్స్‌తోనే జొకో ఆటను ముగించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ తలపడినప్పుడు అత్యంత అరుదుగా మాత్రమే మ్యాచ్ ఐదు సెట్స్ వరకూ కొనసాగడం మరో ఆసక్తికర విషయం. 2023 నాటి వింబుల్డన్‌లో ఇద్దరూ ఐదు సెట్ల వరకూ పోరాడారు.
ఇక యూఎస్ ఓపెన్‌లో ఈ ఇద్దరూ తలపడటం ఇదే తొలిసారి. గతేడాది యూఎస్ ఓపెన్‌లో అల్కారజ్ రెండో రౌండ్‌లోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్, ప్యారిస్ ఒలింపిక్స్ అల్కారజ్ జొకో చేతిలో ఓటమి చవి చూశాడు. దీంతో, మూడోసారి ఓటమి నుంచి తప్పించుకునేందుకు అతడు మరింతగా శ్రమపడక తప్పదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
విజేత | ఈవెంట్ | మ్యాచ్ | సంవత్సరం |
జొకోవిచ్ | ఆస్ట్రేలియన్ ఓపెన్ | క్వార్టర్ ఫైనల్ | 2025 |
జొకోవిచ్ | పారిస్ ఒలింపిక్స్ | ఫైనల్ | 2024 |
అల్కారజ్ | వింబుల్డన్ | ఫైనల్ | 2024 |
జొకోవిచ్ | ATP ఫైనల్స్ | సెమీఫైనల్ | 2023 |
జొకోవిచ్ | సిన్సినాటి ఓపెన్ | ఫైనల్ | 2023 |
అల్కారజ్ | వింబుల్డన్ | ఫైనల్ | 2023 |
జొకోవిచ్ | ఫ్రెంచ్ ఓపెన్ | సెమీఫైనల్ | 2023 |
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..