ED Summons Dhawan: ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:09 PM
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన క్రికెటర్లు, సెలబ్రిటీలు చిక్కులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బెట్టింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ప్రస్తుతం దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు చిక్కులు ఎదుర్కొంటున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) కూడా ఆ జాబితాలో చేరాడు. విచారణకు రావాల్సిందిగా శిఖర్ ధవన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నోటీసులు జారీ చేశారు(Illegal betting app case).
ధవన్ గతంలో 1xBet అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశాడు ధవన్. ఆ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ధవన్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులను ఇటీవలి కాలంలో ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని బెట్టింగ్ యాప్స్ రూ.కోట్లల్లో మోసాలకు పాల్పడడంతోపాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి (ED investigation 2025).
బెట్టింగ్ యాప్స్ భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ విచారణ ప్రారంభించింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెబ్రిటీలు ఇప్పటికే విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా గత నెల ఈడీ ముందు హాజరయ్యాడు. అలాగే హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తదితరులు కూడా విచారణను ఎదుర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రోహిత్ శర్మ షాకింగ్ వెయిట్‌లాస్.. 95 నుంచి 75 కిలోలకు.. ఫాలో అయిన డైట్ ఇదే..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..