Rohit Sharma weight loss: రోహిత్ శర్మ షాకింగ్ వెయిట్‌లాస్.. 95 నుంచి 75 కిలోలకు.. ఫాలో అయిన డైట్ ఇదే..
ABN , Publish Date - Sep 03 , 2025 | 07:00 AM
టెస్ట్ ఫార్మాట్, టీ-20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఐపీఎల్ ఆడిన రోహిత్ అప్పట్నుంచి మైదానానికి దూరంగా ఉన్నాడు. ఇటీవల బ్రాంక్ టెస్ట్ పాసై తాను సూపర్ ఫిట్‌గా ఉన్నానని నిరూపించుకున్నాడు.
టెస్ట్ ఫార్మాట్, టీ-20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఐపీఎల్ ఆడిన రోహిత్ అప్పట్నుంచి మైదానానికి దూరంగా ఉన్నాడు. ఇటీవల బ్రాంక్ టెస్ట్ పాసై తాను సూపర్ ఫిట్‌గా ఉన్నానని నిరూపించుకున్నాడు. అయితే గత మూడు నెలల కాలంలో రోహిత్ ఏకంగా 20 కిలోల బరువు తగ్గాడట (20kg weight loss). కొంతకాలంగా తన ఫిట్‌నెస్ విషయంలో వస్తున్న విమర్శలకు రోహిత్ తన వెయిట్‌లాస్ జర్నీతో చెక్ పెట్టాడట (Rohit weight loss transformation).
రోహిత్ బరువు 95 కిలోలు. అయితే మూడు నెలలు కఠినమైన డైట్ చేసి ఏకంగా 20 కిలోల వరకు రోహిత్ తగ్గాడట. తాజాగా రోహిత్ శర్మకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో రోహిత్ సన్నగా కనబడడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది (Rohit Sharma diet). రోహిత్ మంచి భోజన ప్రియుడు. దాల్ చావల్, బటర్ చికెన్, వడా పావ్, బిర్యానీలను ఇష్టంగా తింటాడు. అయితే ఫిట్‌నెస్ సాధించే క్రమంలో రోహిత్ వీటన్నింటినీ దూరం పెట్టాడట. రోహిత్ మూడు నెలల పాటు ఫాలో అయిన డైట్ ఇదేనంటూ ఒక డైట్ ప్లాన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అది అధికారికంగా కన్ఫామ్ కాదు.
రోహిత్ ఫాలో అయిన డైట్ ఛార్ట్..
7.00 - ఆరు బాదం పప్పులు, మొలకలు, ఫ్రెష్ జ్యూస్
9.30 - ఓట్‌మీల్, గ్లాసుడు పాలు
11.30 - పెరుగు, కొబ్బరి నీళ్లు
1.30 - కూరగాయలతో భోజనం, సలాడ్
4.30 - ఫ్రూట్ స్మూతీ, డ్రై ఫ్రూట్స్
7.30 - కారగాయలు, పనీర్, వెజిటబుల్ సూప్
9.30 - గ్లాసుడు పాలు, నట్స్
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి