Kohli London test: కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
ABN , Publish Date - Sep 04 , 2025 | 07:17 AM
టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే టీ-20, టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరు ఇకపై టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడబోతున్నారు.
టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే టీ-20, టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరు ఇకపై టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడబోతున్నారు. అక్టోబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది. టీ-20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ పాల్గొనబోతున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CEO)లో బీసీసీఐ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తోంది (BCCI fitness test). ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా తదితరులు ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరై పాసయ్యారు. అయితే లండన్‌లో ఉంటున్న కోహ్లీ మాత్రం ఈ పరీక్ష కోసం భారత్‌కు రాలేదు. కోహ్లీ చాలా కాలంగా కుటుంబంతో కలిసి లండన్‌లోనే నివసిస్తున్న సంగతి తెలిసిందే (Kohli London test).
ఈ నేపథ్యంలో లండన్‌లోనే కోహ్లీకి ఫిట్‌నెస్ టెస్ట్‌కు హాజరయ్యేందుకు బీసీసీఐ అనుమతినిచ్చిందట. దీంతో కోహ్లీ లండన్‌లోనే ఆ టెస్ట్‌కు హాజరై తన ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసయ్యాడు. కోహ్లీకి ప్రత్యేకంగా ఇలాంటి అనుమతిని ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి (Kohli fitness controversy). చాలా రోజుల పాటు మైదానానికి దూరంగా ఉన్న కోహ్లీకి ఎవరికీ ఇవ్వని ప్రత్యేక అనుమతి ఎందుకని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. భారత్‌కు రాకుండానే కోహ్లీ అట్నుంచి అటే ఆస్ట్రేలియా పయనం కాబోతున్నాడు.
ఇవి కూడా చదవండి..
రోహిత్ శర్మ షాకింగ్ వెయిట్‌లాస్.. 95 నుంచి 75 కిలోలకు.. ఫాలో అయిన డైట్ ఇదే..
Virat Kohli Responds: ఇకపై మరింత బాధ్యతగా ఉంటాం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..