Virat Kohli Responds: ఇకపై మరింత బాధ్యతగా ఉంటాం
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:51 AM
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గత జూన్ నాలుగున జరిగిన తొక్కిసలాటపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎట్టకేలకు స్పందించాడు. ‘అది.. మా ఫ్రాంచైజీ చరిత్రలో ఓ సంతోషకరమైన...
‘చిన్నస్వామి’ ఘటనపై కోహ్లీ
న్యూఢిల్లీ: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గత జూన్ నాలుగున జరిగిన తొక్కిసలాటపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎట్టకేలకు స్పందించాడు. ‘అది.. మా ఫ్రాంచైజీ చరిత్రలో ఓ సంతోషకరమైన ఘట్టం కావాల్సింది. కానీ విషాదంగా మారింది. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన మా అభిమానుల గురించి ఆలోచిస్తున్నా. వారి గురించి ప్రార్థిస్తున్నా. ఇకపై జాగ్రత్తగా, బాధ్యతగా, గౌరవంగా ముందుకు సాగుతాం’ అని కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుచుకున్న సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవంలో తొక్కిసలాట జరిగి 11 మంది క్రికెట్ ఫ్యాన్స్ మరణించగా, మరో 71 మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి