ఆస్ట్రేలియా ఓపెన్ 2026.. అల్కరాస్‌దే టైటిల్
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:59 PM
ఆస్ట్రేలియా ఓపెన్ 2026 ఫైనల్‌లో కార్లోస్ అల్కరాస్ సంచలన విజయం సాధించాడు. పురుషుల టెన్నిస్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా అల్కరాస్ చరిత్ర సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్‌లో సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్‌పై అల్కరాస్ విజయం సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ఓపెన్ 2026 ఫైనల్‌లో కార్లోస్ అల్కరాస్ సంచలన విజయం సాధించాడు. పురుషుల టెన్నిస్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా అల్కరాస్ చరిత్ర సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్‌లో సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్‌పై 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో అల్కరాస్ విజయం సాధించాడు.
టెన్నిస్ చరిత్రలో అత్యధిక (25) గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించాలనుకున్న జకోవిచ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం 24 టైటిళ్లతో ఉన్న నొవాక్.. 25వ టైటిల్ కోసం చాలా కష్టపడుతున్నాడు. చివరగా 2023లో యూఎస్ ఓపెన్ గెలిచాక.. అతడు మళ్లీ గ్రాండ్‌స్లామ్ కొట్టలేకపోతున్నాడు. జకోవిచ్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఇది తొలి ఓటమి. అంతకుముందు ఈ టోర్నమెంట్‌లో ఫైనల్ చేరిన పదిసార్లూ అతడు విజేతగా నిలవడం విశేషం.
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ
భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ