అండర్ 19 ప్రపంచ కప్: టీమిండియా ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:19 PM
అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా టీమిండియా పాకిస్థాన్‌తో తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్థాన్‌కు 253 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా టీమిండియా పాకిస్థాన్‌తో తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్థాన్‌కు 253 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి పరుగులు సాధించడానికి బ్యాటర్లు కాస్త తడబడ్డారు 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను.. వేదాంత్ త్రివేది(68) ఆదుకున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. మరోసారి విఫలమయ్యాడు. ప్రత్యర్థి ఎవరైనా తనదైన శైలిలో విరుచుకుపడే వైభవ్.. పాక్‌తో మ్యాచులో మాత్రం నిరాశపరుస్తూ వస్తున్నాడు. తాజా మ్యాచులోనూ అదే రిపీట్ అయింది. ఆఖరిలో వచ్చి అంబరిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్ కాస్త పర్వాలేదనిపించారు.
టీమిండియా బ్యాటర్లలో ఆరోన్ జార్జ్(16), అభిజ్ఞాన్ కుందు(16) నిరాశపర్చారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే(0) పేలవమైన ఫామ్ మళ్లీ కొనసాగింది. వేదాంత్ త్రివేది(68) కాస్త పరుగులు రాబట్టి జట్టును ఆదుకున్నాడు. అతడే ఈ మ్యాచులో టాప్ స్కోరర్. వైభవ్ సూర్యవంశీ(30), కనిష్క్ చౌహాన్(35), అంబరిష్(29), విహాన్ మల్హోత్ర(21), ఖిలాన్ పటేల్(21) పర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, సయ్యం 2, అలీ రజా, అహ్మద్ హుస్సేన్, కమర్, అలీ హసన్ తలో వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ
భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ