Share News

టీ20 ప్రపంచ కప్‌నకు దూరం.. బంగ్లాదేశ్‌లో కొత్త టోర్నమెంట్

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:38 PM

బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్.. తమ దేశ ఆటగాళ్ల కోసం ఓ కొత్త టీ20 టోర్నమెంట్‌ను ప్రారంభించనుంది. దీనికి ఓడోమ్మో బంగ్లాదేశ్ టీ20 కప్ 2026 అని పేరు పెట్టింది.

టీ20 ప్రపంచ కప్‌నకు దూరం.. బంగ్లాదేశ్‌లో కొత్త టోర్నమెంట్
Bangladesh

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ రానున్న టీ20 ప్రపంచ కప్‌ మ్యాచులను భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను రీప్లేస్‌మెంట్‌గా ఐసీసీ(ICC) ప్రకటించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తమ దేశ ఆటగాళ్ల కోసం ఓ కొత్త టీ20 టోర్నమెంట్‌ను ప్రారంభించనుంది. దీనికి ఓడోమ్మో బంగ్లాదేశ్ టీ20 కప్ 2026 అని పేరు పెట్టింది. కాగా ‘ఓడోమ్మో’ అంటే బంగ్లాలో అజేయమైన లేదా ఎవ్వరికీ లొంగనిది అని అర్థం.


ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో మూడు జట్లు తలపడనున్నాయి. ధూమ్‌కేతు XI జట్టుకు లిట్టన్ దాస్, దర్బార్ XI జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో, దురంటో XI జట్టుకు అక్బర్ అీ నాయకత్వం వహించనున్నారు. ప్రైజ్‌మనీ, ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులకు రూ.1.87 కోట్లు ఖర్చు చేస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు. మ్యాచ్‌లకు మరింత ఊపు తీసుకొచ్చేందుకు ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌’ను ఈ టోర్నీలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో గ్రూప్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 9న ఫైనల్ నిర్వహిస్తారు. మరోవైపు టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.


ఇవి కూడా చదవండి:

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ

భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ

Updated Date - Feb 01 , 2026 | 05:38 PM