Share News

Sabalenka US Open: యూఎస్ ఓపెన్ విజేత సబలెంక.. ఆమెకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:21 PM

అత్యంత ఆసక్తికరంగా సాగిన యూఎస్ ఓపెన్‌లో బెలారస్ క్రీడాకారిణి అర్యనా సబలెంక విజేతగా నిలిచింది. అమెరికాకు చెందిన అనిసిమోవాపై 6-3, 7-6 (3)తో వరుస సెట్లలో విజయాలు సాధించిన సబలెంక విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Sabalenka US Open: యూఎస్ ఓపెన్ విజేత సబలెంక.. ఆమెకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
US Open prize money 2025

అత్యంత ఆసక్తికరంగా సాగిన యూఎస్ ఓపెన్‌లో బెలారస్ క్రీడాకారిణి అర్యనా సబలెంక (Aryna Sabalenka) టైటిల్ సాధించింది. అమెరికాకు చెందిన అనిసిమోవాపై 6-3, 7-6 (3)తో వరుస సెట్లలో విజయాలు సాధించిన సబలెంక విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సబలెంక తాజా యూఎస్ ఓపెన్ టోర్నీ మొత్తానికి ఒక్క సెట్‌ను మాత్రమే చేజార్చుకుంది (US Open champion payout).


తాజా విజయవంతో సబలెంక రికార్డ్ ప్రైజ్‌మనీని దక్కించుకుంది (US Open prize money 2025). యూఎస్ ఓపెన్ పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు సమానంగా ఐదు మిలియన్ డాలర్ల చొప్పున టోర్నీ నిర్వాహకులు అందించారు. అంటే ఈ విజయం ద్వారా సబలెంకకు రూ.44.08 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచి 22.04 కోట్ల రూపాయల అందుకోనుంది. వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్‌లో కూడా ఓటమి చవిచూడడంతో అసినిమోవా కోర్టులోనే కన్నీటిపర్యంతమైంది.


ఇవి కూడా చదవండి..

సంజూ శాంసన్ ప్లేస్‌లో జితేష్ శర్మ.. తొలి మ్యాచ్ ఆడేది ఎవరు?

టీమిండియాకు సరికొత్త జెర్సీ.. ఆసియా కప్‌లో ఆటగాళ్లు ధరించే జెర్సీలు చూశారా?

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2025 | 01:21 PM