Share News

TeamIndia jersey: టీమిండియాకు సరికొత్త జెర్సీ.. ఆసియా కప్‌లో ఆటగాళ్లు ధరించే జెర్సీలు చూశారా?

ABN , Publish Date - Sep 07 , 2025 | 07:58 AM

మరో రెండ్రోజుల్లో దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 ప్రారంభం కాబోతోంది. పూర్తిగా టీ-20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఆసియా ఖండానికి సంబంధించిన జట్లు పాల్గొనబోతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే దుబాయ్‌లో ల్యాండ్ అయ్యి ప్రాక్టీస్ ప్రారంభించింది.

TeamIndia jersey: టీమిండియాకు సరికొత్త జెర్సీ.. ఆసియా కప్‌లో ఆటగాళ్లు ధరించే జెర్సీలు చూశారా?
TeamIndia jersey

మరో రెండ్రోజుల్లో దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 (Asia Cup 2025) ప్రారంభం కాబోతోంది. పూర్తిగా టీ-20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఆసియా ఖండానికి సంబంధించిన జట్లు పాల్గొనబోతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే దుబాయ్‌లో ల్యాండ్ అయ్యి ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ టోర్నీలో టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10వ తేదీన ఆడబోతోంది. ఈ టోర్నీలో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగబోతోంది (India cricket jersey).


ఇప్పటివరకు టీమిండియాకు డ్రీమ్ 11 మధ్య స్పాన్సర్ చేసేది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ డీల్ ఇటీవల రద్దు అయింది (Dream11 logo removed). దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్‌షిప్ కోసం టెండర్లను కూడా పిలిచింది. అయితే ఆసియా కప్ సమయానికి స్పాన్సర్‌షిప్ వ్యవహారం తేలలేదు. దీంతో ఎటువంటి స్పాన్సర్‌షిప్ లేకుండానే ఆసియా కప్‌లో టీమిండియా ఆడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త జెర్సీపై ఎలాంటి లోగో ఉండబోవడం లేదు. కొత్త జెర్సీతో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (India jersey 2025).


టీమిండియా కొత్త జెర్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త జెర్సీపై స్పాన్సర్ పేరు లేదు. జెర్సీ ఎడమ వైపున బీసీసీఐ లోగో మాత్రమే ఉంది. కాగా, సెప్టెంబర్ 10వ తేదీన జరిగే తొలి మ్యాచ్‌లో యూఏఈతో భారత్ తొలి మ్యాచ్ ఆడబోతోంది. అలాగే సెప్టెంబర్ 14వ తేదీన పాకిస్థాన్‌తో ఆడుతుంది. ఇక, 19వ తేదీన ఒమన్ జట్టుతో తలపడనుంది.


ఇవి కూడా చదవండి..

ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2025 | 07:58 AM