Sanju Samson injury: సంజూ శాంసన్ ప్లేస్‌లో జితేష్ శర్మ.. తొలి మ్యాచ్ ఆడేది ఎవరు?
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:23 PM
దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కాబోతోంది. పూర్తిగా టీ-20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఆసియా ఖండానికి సంబంధించిన జట్లు పాల్గొనబోతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే దుబాయ్‌లో ల్యాండ్ అయ్యి ప్రాక్టీస్ ప్రారంభించింది.
దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 (Asia Cup 2025) మరో రెండ్రోజుల్లో ప్రారంభం కాబోతోంది. పూర్తిగా టీ-20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఆసియా ఖండానికి సంబంధించిన జట్లు పాల్గొనబోతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే దుబాయ్‌లో ల్యాండ్ అయ్యి ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ టోర్నీలో టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10వ తేదీన ఆడబోతోంది. ఈ మ్యాచ్‌కు ఓపెనర్ సంజూ శాంసన్ అందుబాటులో ఉండడం అనుమానాస్పదంగా మారింది (Sanju Samson injury).
సంజూ శాంసన్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా లేడని వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో సంజూ పాల్గొనకుండా ఒక పక్కన కూర్చుని బ్యాటింగ్ కోచ్‌తో మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో సంజూ ఫిట్‌నెస్‌పై అనుమానాలు మొదలయ్యాయి (Asia Cup playing XI). సెప్టెంబర్ 10వ తేదీన యూఏఈ జరిగే తొలి మ్యాచ్‌కు సంజూ అందుబాటులో ఉండడంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సంజూ ప్లేస్‌లో జితేష్ శర్మను ఆడిస్తారని తెలుస్తోంది. తాజా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన జితేష్ శర్మ అద్భుతంగా రాణించాడు (Jitesh Sharma selection).
ఆసియా కప్ కోసం శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసినపుడే సంజూ స్థానంపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే అభిషేక్ శర్మతో కలిసి సంజూనే ఓపెనింగ్ చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది సంజూ టీ-20 క్రికెట్‌లో అమోఘంగా రాణించాడు. ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 30 సిక్స్‌లు కొట్టాడు. అయితే ఫిట్‌నెస్ రూపంలోనే సంజూకు సమస్య ఎదురైంది. మరి, ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో సంజూకు ఛాన్స్ దక్కుతుందో, లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..