Share News

ఐసీసీతో గూగుల్ ఒప్పందం

ABN , Publish Date - Jan 30 , 2026 | 02:21 PM

ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్‌డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు క్రికెట్‌ను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.

ఐసీసీతో గూగుల్ ఒప్పందం
Google ICC partnership

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీ(ICC)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్‌డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు మ్యాచులను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది. ఈ మేరకు గూగుల్(Google) సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయం గురించి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఇప్పుడు గూగుల్.. మీ గూగ్లీకి సహాయం చేస్తుంది’ అని పేర్కొన్నారు.


ఏఐ జెమిని 3 ప్రో లైవ్ మ్యాచును గమనించి, కామెంటరీని విని, ఏం జరిగిందనేది సరళమైన భాషలో ఫ్యాన్స్‌కు వివరిస్తుంది. మ్యాచు హైలైట్స్, ఆటగాళ్లు, ఆటకు సంబంధించి ఇతర ఆసక్తికర విషయాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచనుంది. ఈ అధునాతన సాంకేతికతను వాడి మహిళల క్రికెట్‌ను మరింతగా అభిమానులకు చేరువ చేయడం కూడా ఈ భాగస్వామ్యం ఉద్దేశం.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!

నా రిటైర్మెంట్‌‌కు కారణం అదే.. యువీ షాకింగ్‌ కామెంట్స్‌..

Updated Date - Jan 30 , 2026 | 02:21 PM