ఫైనల్లో సబలెంక X రిబకినా
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:03 AM
టాప్‌సీడ్ అర్యాన సబలెంక, ఐదోసీడ్ ఎలీనా రిబకినా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. గురువారం జరిగిన సెమీఫైనల్లో బెలారస్ భామ...
పెగులా, స్విటోలినా ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: టాప్‌సీడ్ అర్యాన సబలెంక, ఐదోసీడ్ ఎలీనా రిబకినా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. గురువారం జరిగిన సెమీఫైనల్లో బెలారస్ భామ సబలెంక 6-2, 6-3తో 12వ సీడ్ ఉక్రెయిన్ స్టార్ స్విటోలినాను చిత్తు చేసింది. వరల్డ్ నెం.1 సబలెంకకు మెల్‌బోర్న్ పార్క్‌లో ఇది వరుసగా ఐదో ఫైనల్ కావడం విశేషం. మరో సెమీస్‌లో కజకిస్థాన్‌కు చెందిన వింబుల్డన్ మాజీ విజేత రిబకినా 6-3, 7-6 (7)తో ఆరో సీడ్ జెస్సిక పెగులా (అమెరికా)పై గెలిచింది. తుదిపోరు శనివారం జరుగనుంది. మరి.. 2023 ఫైనల్లో ఇక్కడ సబలెంక చేతిలో ఓటమికి రిబకినా బదులు తీర్చుకుంటుందేమో చూడాలి.
సబలెంకకు పెనాల్టీ: మొదటి సెట్ నాలుగో గేమ్‌లో బంతిని కొడుతున్న సమయంలో సబలెంక బిగ్గరగా అరుస్తుండడంతో చైర్ అంపైర్ ఆమెకు ఒక పాయింట్ పెనాల్టీగా విధించింది. అయితే అంపైర్ నిర్ణయంతో విభేదించిన సబలెంక వీడియోను పరిశీలించి నిర్ణయంపై సమీక్ష చేయాలని కోరింది. వీడియో తిలకించిన చైర్ అంపైర్ సబలెంక నోటినుంచి పెద్దగా శబ్ధం వస్తున్నదని నిర్ధారించుకొని స్విటోలినాకు పాయింట్ కేటాయించింది. దీనిపై సబలెంక అసంతృప్తి ప్రకటించింది. కాగా..మ్యాచ్ అనంతరం సబలెంక, స్విటోలినా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోకపోవడం గమనార్హం.
పురుషుల
సెమీస్ నేడు
పురుషుల సెమీఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగే పోరులో టాప్ సీడ్ అల్కారజ్.. మూడో సీడ్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. మరో సెమీ్‌సలో డిఫెండింగ్ చాంప్, రెండో సీడ్ సినర్- నాలుగో సీడ్ జొకోవిచ్‌ను ఢీకొంటాడు. కెరీర్ గ్రాండ్‌స్లామ్ వేటలోనున్న అల్కారజ్, నిరుటి రన్నరప్ జ్వెరెవ్‌ను దాటతాడా..? పదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన 38 ఏళ్ల జొకోవిచ్.. గత రెండుసార్లుగా మెల్‌బోర్న్ పార్క్ విజేతగా నిలిచిన 24 ఏళ్ల సినర్‌ను నిలువరించగలడా? నేడు తేలనుంది.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!
నా రిటైర్మెంట్‌కు కారణం అదే.. యువీ షాకింగ్ కామెంట్స్..