పక్కకి తప్పుకోండి.. సంజు వస్తున్నాడు: ఫన్నీ వీడియో వైరల్
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:49 PM
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడడానికి టీమిండియా తిరువనంతపురం చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా ప్లేయర్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా-న్యూజిలాండ్ జట్లు ఆఖరి మ్యాచ్ కేరళలోని తిరువనంతపురం వేదికగా ఆడనున్నారు. దీనికోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా ప్లేయర్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ స్వస్థలం కేరళనే కావడంతో అతడిని చూడటానికి అక్కడి అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav).. సంజుని సరదాగా ఆటపట్టించాడు.
ఎయిర్‌పోర్ట్ నుంచి బస్సు వరకు అతడి ముందు నడుస్తూ.. అందరినీ ‘పక్కకు జరగండి.. నో ఫొటోస్.. ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు.. తప్పుకోండి’ అంటూ సరదాగా సెక్యురిటీలా ప్రవర్తించాడు. దీంతో సంజు(Sanju Samson)తో పాటు పక్కన ఉన్న సిబ్బంది కూడా నవ్వులు చిందించారు. అంతకుముందు ‘ల్యాండింగ్ ఇన్ గాడ్స్ ఓన్ కంట్రీ’ అని సూర్య.. సంజుతో అన్నాడు. దానికి సంజు ‘ఫీలింగ్ గ్రేట్’ అని సమాధానమిచ్చాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది.
న్యూజిలాండ్‌తో ఐదు టీ20 సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది. కాగా చివరి టీ20లోనూ విజయం సాధించి.. ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ పోరును ఘనంగా ప్రారంభించాలని చూస్తోంది. కాగా ఈ మెగా టోర్నీలో టీమిండియా.. తన తొలి మ్యాచును ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా