Share News

AP Assembly Sessions: ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

ABN , Publish Date - Sep 27 , 2025 | 05:40 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎనిమిది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి .

AP Assembly Sessions:  ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly Sessions

అమరావతి , సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) నిరవధికంగా వాయిదా పడ్డాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Speaker Ayanna Patrudu) తెలిపారు. ఎనిమిది రోజులపాటు జరిగాయి అసెంబ్లీ సమావేశాలు. 23 బిల్లులు సభలో ప్రవేశపెట్టామని.. అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని పేర్కొన్నారు. మూడు బిల్లులు ఉపసంహరణ చేశామని వెల్లడించారు. అసెంబ్లీలో ఆరు అంశాలపై లఘుచర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శాసనసభ నిరవదిక వాయిదా వేశామని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.


స్పీకర్‌తో సీఎం చంద్రబాబు భేటీ..

అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజులను కలిశారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై కాసేపు మాట్లాడుకున్నారు స్పీకర్, సీఎం. అసెంబ్లీలో సభ్యుల సదుపాయాలపై కమిటీ చేసిన సూచనలను సీఎంకు వివరించారు స్పీకర్. అనంతరం అసెంబ్లీలో శాసనసభ్యుల గ్రూప్ ఫొటోను సీఎంకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ అందజేశారు.


ఇవి కూడా చదవండి..

వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఫైర్‌

వాళ్లకు ఒకలా... మాకు ఒకలానా... మండలిలో ‘కాఫీ’పై వార్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 07:10 PM