Share News

Raghurama: అసెంబ్లీ సమావేశాలపై.. రఘురామ క్లారిటీ

ABN , Publish Date - Jan 18 , 2026 | 06:26 PM

అసెంబ్లీ సమావేశాలపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు..

Raghurama: అసెంబ్లీ సమావేశాలపై.. రఘురామ క్లారిటీ
Raghurama Krishnam Raju

విశాఖపట్నం, జనవరి18 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు రావాలని ఆహ్వానించారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే అంశంపై ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో రఘురామ ఆదివారం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


అనర్హత వేటు..

ఎమ్మెల్యేలు సభకు వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. 60 రోజుల్లో ఒక్కసారి అసెంబ్లీకి వచ్చినా సరిపోతుందని చెప్పారు. శాసన మండలిలో ఒకరకమైన వాతావరణం, శాసనసభలో మరో వాతావరణం ఉందన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. శాసనమండలిలో ఒక తరహా వాతావరణం.. శాసనసభలో మరో తరహా వాతావరణం వంటివి ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించాలని హితవు పలికారు. తానెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.


ఆ నిబంధన లేదు..

పదో షెడ్యూల్ ప్రకారం ఉన్న మినహాయింపులు అర్ధం కాక.. ఇంగ్లీషులో ఉన్నది అర్ధం చేసుకోలేని వాళ్లే ఇలా మాట్లాడుతున్నారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. తనపై అభ్యంతరాలతో ఏపీ ప్రభుత్వానికి వచ్చాయని ప్రస్తావించారు. తాను స్వీయ నియంత్రణ పాటించే వాడినని.. అందుకే టీడీపీ సమావేశాలకు హాజరవడం లేదని.. అలాగని పాల్గొనకూడదనే నిబంధన కూడా లేదని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్

అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

For More AP News And Telugu News

Updated Date - Jan 18 , 2026 | 07:05 PM