AP Assembly: కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వ్యాఖ్యలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగింపు
ABN , Publish Date - Sep 27 , 2025 | 08:10 PM
సినిమా నటులకు అవమానం జరిగిందని కామినేని శ్రీనివాస్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదానికి మూలమైన కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో సినిమా నటులకు అవమానం జరిగిందని డాక్టర్ కామినేని శ్రీనివాస్ (Kamineneni Srinivas) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (AP Assembly)లో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదానికి మూలమైన కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యలను రికార్డుల నుంచి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker Ayyannapatrudu) తొలగించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ విషయంలో సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికారు. ఇద్దరి ఎమ్మెల్యేల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు జనసేన ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు అసెంబ్లీ అధికారులు. ఈ రోజు ఉదయం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు సభలోనే ప్రకటించారు డాక్టర్ కామినేని శ్రీనివాస్. తన వ్యాఖ్యలను అపార్ధం చేసుకున్నారని కామినేని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని కామినేని కోరడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం:మంత్రి కందుల దుర్గేష్
గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News