Share News

Chairman Protocol Row: ఛైర్మన్‌ను ఎప్పుడూ గౌరవస్తాం.. మంత్రి పయ్యావుల క్లారిటీ

ABN , Publish Date - Sep 27 , 2025 | 01:01 PM

ఛైర్మన్‌ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఛైర్మన్ ప్రొటోకాల్ విషయంలో పొరపాట్లు జరిగాయేమోననే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.

Chairman Protocol Row: ఛైర్మన్‌ను ఎప్పుడూ గౌరవస్తాం.. మంత్రి పయ్యావుల క్లారిటీ
Chairman Protocol Row

అమరావతి, సెప్టెంబర్ 27: విరామం ఏపీ శాసనమండలి సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రొటోకాల్ వివాదంపై చర్చించిన అంశాలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) సభలో వివరించారు. ‘మా స్కూలే డిఫరెంట్ స్కూల్.. మా స్కూల్‌లో ట్రైనింగే డిఫరెంట్. మీరు ఆ స్కూలు కాదు కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మీకు నవ్వులాటగా ఉంటుంది’ అంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి పయ్యావుల మాట్లాడారు. అత్యున్నత స్థానంలో ఉన్న ఛైర్మన్ స్థానాన్ని తాము, తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఛైర్మన్‌ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదన్నారు. ఛైర్మన్ ప్రొటోకాల్ విషయంలో పొరపాట్లు జరిగాయేమోననే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ఇకపై ప్రొటోకాల్ పరంగా సమస్యలు పునరావృతంగా కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యవుల కేశవ్ చెప్పారు.


ప్రభుత్వానికి ధన్యవాదాలు: మండలి ఛైర్మన్

తన సమస్యపై సానుకూలంగా సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వానికి మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ధన్యవాదాలు తెలియజేశారు. మనం వ్యవస్థను, వ్యక్తులను, సమాజాన్ని ఎప్పూడూ గౌరవించాలని సూచించారు. ఇదే విషయాన్ని అధికారులకూ తెలియజేస్తున్నాని మండలి ఛైర్మన్ మోషన్ రాజు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బీఎస్‌ఎన్‌ఎల్ 4జీకి చంద్రబాబు శ్రీకారం

చివరి రోజుకు అసెంబ్లీ సమావేశాలు.. హాట్ టాపిక్స్ ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 01:21 PM