Share News

BSNL 4G Launch: బీఎస్‌ఎన్‌ఎల్ 4జీకి చంద్రబాబు శ్రీకారం

ABN , Publish Date - Sep 27 , 2025 | 11:43 AM

నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్‌ను లాభాల బాటలోకి తీసుకువెళ్లిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఒక్కరికి నిరంతరాయంగా బీఎస్ఎన్‌ఎల్ సేవల అందాలని తెలిపారు.

BSNL 4G Launch: బీఎస్‌ఎన్‌ఎల్ 4జీకి చంద్రబాబు శ్రీకారం
BSNL 4G Launch

అమరావతి, సెప్టెంబర్ 27: బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేజీ 4జీ నెట్‌వర్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (శనివారం) ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ... నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్‌ను లాభాల బాటలోకి తీసుకువెళ్లిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అని అన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఒక్కరికి నిరంతరాయంగా బీఎస్ఎన్‌ఎల్ సేవలు అందాలని తెలిపారు.


2014 నాటికి కేవలం 24 కోట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు 97 కోట్లకు ఇంటర్నెట్ కనెక్షన్ చేరుకున్నాయని చెప్పారు. స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచాన్ని చుట్టి రావచ్చని మంత్రి అన్నారు. దేశీయంగా 4జీ టెక్నికల్‌ను స్థాపించుకున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.


ప్రతి గ్రామానికీ హైస్పీడ్ ఇంటర్నెట్: కేంద్రమంత్రి

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 33 కోట్ల ఫోన్లు దేశవ్యాప్తంగా తయారవుతున్నాయని.. కేవలం నాలుగు దేశాలు మాత్రమే టెలిఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయని.. అందులో భారతదేశం ఒకటి అని చెప్పుకొచ్చారు. స్కూల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్‌లో ఇంటర్నెట్ కచ్చితంగా ఉండాలన్నారు. విద్యుత్తు, మంచినీరు ఎలా అవసరమో ఇంటర్నెట్ కూడా అంతే అవసరమని వెల్లడించారు. ప్రతి గ్రామానికి కి త్వరలో హైస్పీడ్ ఇంటర్నెట్, మొబైల్ టవర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. బీఎస్ఎన్ఎల్ తిరిగి లాభాల బాటలోకి తీసుకువెళ్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

చివరి రోజుకు అసెంబ్లీ సమావేశాలు.. హాట్ టాపిక్స్ ఇవే

వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఫైర్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 11:51 AM