CM Chandrababu BSNL 4G launch: భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:49 PM
బీఎస్ఎన్ఎల్ శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి దూరదృష్టే విజన్ అని అన్నారు. 100 దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశం అని గొప్పగా చెప్పుకొచ్చారు.
అమరావతి, సెప్టెంబర్ 27: బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ కింద దేశవ్యాప్తంగా 97,500 టవర్లను ఒడిశా రాష్ట్రం జార్సుగుడా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీనిపై విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడారు. దేశాన్ని నడిపించే నాయకుడు లేక ఇన్ని రోజులు అవస్థలు పడ్డామని.. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారని ప్రధాని మోదీని కొనియాడారు. ఒకప్పుడు లైటింగ్ కాల్ బుక్ చేస్తే వారం రోజులకు వచ్చేదని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
బీఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి దూరదృష్టే విజన్ అని ప్రశంసించారు. మోదీ ఆధ్వర్యంలో 100 దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశమని తెలిపారు. భారతదేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని.. అది ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఫోన్ అనేది మల్టీపర్పస్ అయిపోయిందని సీఎం తెలిపారు. వాట్సప్ గవర్నెన్స్‌లో 730 సర్వీసులు ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫోన్ వల్ల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగాయనేది తాను రుజువు చేస్తానని చెప్పారు. ఒక్కసారి 4జీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది అసాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతీ పది సంవత్సరాలకు టెక్నాలజీ మారుతూనే ఉంటుందన్నారు. ప్రపంచానికి మనం టెక్నాలజీ అందించే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఎస్ఎన్ఎల్ ఈ దేశానికి దశదిశ నిర్దేశించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలను పొందిందని వెల్లడించారు.స్పేస్ సిటీలో టెక్నాలజీస్‌ను ప్రమోట్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో ప్రధాన మంత్రి క్వాంటమ్ మిషన్ తీసుకొస్తే... క్వాంటమ్ కంప్యూటర్ మొదట అమరావతికి వస్తోందన్నారు. ప్రధానమంత్రి గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తే... హైడ్రోజన్ వ్యాలీని అమరావతికి తీసుకొస్తున్నామని తెలిపారు. టెక్నాలజీని ప్రమోట్ చేయడంలో తాను ముందు వరుసలో ఉంటానని వెల్లడించారు. కార్పొరేట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్‌ల్లో 2047 కల్లా ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీకి చంద్రబాబు శ్రీకారం
చివరి రోజుకు అసెంబ్లీ సమావేశాలు.. హాట్ టాపిక్స్ ఇవే
Read Latest AP News And Telugu News