Andhra Pradesh Tourism: ఏపీలో పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్: మంత్రి కందుల
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:21 PM
10 వేల 640 కోట్ల రూపాయలు పర్యాటక రంగంలో పెట్టుబడులు తెచ్చామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పర్యాట ప్రాంతాల్లో 50 వేల గదులు ఉండాలనేది లక్ష్యమన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 27: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా గోవా తరహాలో చీరాల ప్రాంతంలో బీచ్ టూరిజం అభివృద్ధిపై చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రశ్నించారు. దీనిపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) సమాధానం ఇచ్చారు. బీచ్ పర్యాటకానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 10 వేల 640 కోట్ల రూపాయలు పర్యాటక రంగంలో పెట్టుబడులు తెచ్చామన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పర్యాట ప్రాంతాల్లో 50 వేల గదులు ఉండాలనేది లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు మేరకు పర్యాటక పాలసీని రూపొందించామని చెప్పారు.
పర్యాటకానికి పరిశ్రమ హోదా ఇచ్చామని.. దీని వల్ల పర్యాటక ప్రాజెక్టులకు రాయితీలు ఇచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో హోం స్టేలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూన్నామని వెల్లడించారు. పర్యాటక రంగంలో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం టూరిజంపై శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. 2028కి హోటల్ రూంల సంఖ్య 50 వేలకు పెరుగుతాయన్నారు. టూరిజంలో ఉద్యోగాల కల్పన తమ పాలసీ అని స్పష్టం చేశారు.
2024- 29 ప్రత్యేక టూరిజం పాలసీ అమలులోకి వచ్చిందన్నారు. ఏపీలో పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ వచ్చిందన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి ఏపీలో పెట్టుబడులు కోసం ముందుకు వస్తున్నారని వెల్లడించారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో హోమ్ స్టే ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. స్థానికాంగా ఉన్న ఇంటి యజమానులకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. కార్వాన్‌లను ఉపయోగించి... టూరిజం అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఫైర్
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీకి చంద్రబాబు శ్రీకారం
Read Latest AP News And Telugu News