Kamineni Srinivas Retract Remarks: సినీనటులపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కామినేని.. వివాదానికి తెర..
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:11 PM
కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆ తరువాత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ ను కామినేని కోరారు.
అమరావతి, సెప్టెంబర్ 27: సినీ నటులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ (MLA Kamineni Srinivas) ఏపీ శాసనసభలో వివరణ ఇచ్చారు. రెండు రోజుల క్రితం గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లిన సినిమా నటులను అవమానించారంటూ తాను చేసి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కామినేని ప్రకటించారు. ఆ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన కోరారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ.. ఇది మంచి పరిణామం అంటూ వ్యాఖ్యానించారు.
ఈ విషయంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడితో మాట్లాడి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారు. కాగా, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆ తరువాత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాయి. ఈ క్రమంలో కామినేని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని రికార్డుల నుంచి తొలగించాలని చెప్పడటంతో వివాదానికి తెరపడినట్లు అయ్యింది.
జనసేన ఎమ్మెల్యేల స్పందన...
సినీనటులపై చేసిన వ్యాఖ్యలను కామినేని ఉపసంహరించుకోవడంపై జనసేన ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సభలో కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత పరిణామాలు చూశామన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే కామినేని ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని చెప్పడం హర్షణీయమన్నారు. కామినేని ఆరోజు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారని తెలిపారు. సభలో ప్రజా సమస్యల మీద మాట్లాడానికి మాత్రమే తమకు సమయం ఉంటుందని వెల్లడించారు. కేవలం రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసం మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జనసేన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఛైర్మన్‌ను ఎప్పుడూ గౌరవస్తాం.. మంత్రి పయ్యావుల క్లారిటీ
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీకి చంద్రబాబు శ్రీకారం
Read Latest AP News And Telugu News