టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:45 AM
టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. రంగనాయకుల మండపంలో ఇన్‌ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు రవిచంద్ర.
తిరుమల, ఫిబ్రవరి 6: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఇన్‌ఛార్జ్ ఈవోగా సీఎంవో ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర(Muddada Ravichandra) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నేడు ఉదయం సతీసమేతంగా భూవరాహ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన ఆయన.. రంగనాయకుల మండపంలో ఇన్‌ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించి శ్రీవారిని దర్శించుకున్నారు.
సీఎంకు ధన్యవాదాలు: రవిచంద్ర
అనంతరం రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి భక్తుడిగా ఎంతో మందికి సేవచేసే భాగ్యం దక్కిందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు(CM Chandrababu) ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం, భక్తుల నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు, అధికారులతో పాటు అందరి సలహాలు, సూచనలు తీసుకుని సమన్వయంతో ముందుకు సాగుతానన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేలా పరిపాలన కొనసాగిస్తానని చెప్పారు.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవో బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు రవిచంద్ర.
ఇవి కూడా చదవండి...
ఏపీలో ఎన్‌హెచ్ నెట్‌వర్క్ అభివృద్ధికి నిరంతర నిధులు.. గడ్కరీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం
నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు..
Read Latest AP News And Telugu News