నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు..
ABN , Publish Date - Feb 06 , 2026 | 10:04 AM
యువ నటుడు చంద్రహాస్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): యువ నటుడు చంద్రహాస్(యాక్టర్ ప్రభాకర్ కుమారుడు)పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయన నటించిన 'బరాబర్' సినిమా ఆడియో ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్‌లో ఆయన అభ్యంతరకరమైన పదాలతో కూడిన ఓ పాట పాడారు. ఈ పాటపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రజల మర్యాదను దెబ్బతీశారని ఆయనపై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. సదరు ఈవెంట్‌లో ఆయన ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసు నమోదు వివరాలిలా..
జూబ్లీహిల్స్ పోలీసులు BNS 296తో పాటు ఐటీ యాక్ట్ కింద చంద్రహాస్‌పై కేసు నమోదు చేశారు. ఇదే విషయమై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లోనూ చంద్రహాస్‌పై ఇప్పటికే కేసు నమోదైన సంగతి విదితమే. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆయనపై నమోదైన కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
Read Latest Telangana News And AP News And Telugu News