TTD Fire On Fake Allegations: అసత్య ప్రచారాలపై టీటీడీ కన్నెర్ర.. త్వరలో కీలక నిర్ణయం
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:00 PM
తిరుమల రాజకీయ నిరుద్యోగి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల పవిత్రత దెబ్బతిన్నేలా ప్రతిరోజు అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తిరుపతి: వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ(మంగళవారం) మీడియాతో మాట్లాడారు. వైసీపీ సోషియల్ మీడియాలో కూడా టీటీడీపై నిరాధార వార్తలతో ఫేక్ ప్రచారం చేస్తూ బురద జల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారీపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చేసే ఫేక్ ప్రచారాని భక్తులు నమ్మొద్దని సూచించారు. కరుణాకర్ రెడ్డి అసలు హిందూవే కాదని ఎంఎస్ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కరుణాకర్ రెడ్డి తిరుమల రాజకీయ నిరుద్యోగి : భానుప్రకాష్ రెడ్డి
తిరుమల రాజకీయ నిరుద్యోగి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల పవిత్రత దెబ్బతినేలా ప్రతిరోజు అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలిపిరి వద్ద శిల్పకళ క్వార్టర్స్ ఉందని తెలిపారు. టీటీడీకి.. శిల్పకళ క్వార్టర్స్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. బెంగుళూరుకు చెందిన భక్తుడు శనేశ్వర్ విగ్రహాని ఆర్డర్ ఇచ్చాడని గుర్తు చేశారు.
చివరికీ ఆ భక్తుడు విగ్రహాని తీసుకోలేదని పేర్కొన్నారు. కరుణాకర్ రెడ్డికి మహావిష్ణువుకు.. శనేశ్వర్ విగ్రహానికీ తేడా తెలియ్యడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో కూడా విగ్రహం అక్కడే ఉందని తెలిపారు. పథకం ప్రకారమే కరుణాకర్ రెడ్డి టీటీడీపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి బోర్డు సమావేశంలో టీటీడీపై అసత్యపు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసత్యపు ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డి.. హిందూ భక్తులందరికీ క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం