Share News

AP GOVT: భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:00 PM

గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ కోసం ఓ కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లోని చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పూర్తిస్ధాయి విచారణను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.

AP GOVT: భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ కోసం ఓ కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లోని చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.


ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాసిన లేఖపై స్పందించి విచారణ కమిటీని నియమించారు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై పూర్తి వివరాలు సేకరించాలని కలెక్టర్ డీకే బాలాజీ నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణలో ఉన్న భూములను విడిపించి ప్రభుత్వానికి అప్పగించాలని భావిస్తున్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

పరిపాలనకు కలెక్టర్లే వెన్నుముక: సీఎం చంద్రబాబు

For AP News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 04:14 PM