CM Chandrababu On Collectors Conference: పరిపాలనకు కలెక్టర్లే వెన్నుముక: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 15 , 2025 | 03:53 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో జిల్లా కలెక్టర్ల సమావేశం సోమవారం నాడు రాజధాని అమరావతిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 15: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సమర్థవంతమైన పాలనకు కలెక్టర్లు వెన్నుముక అని అభివర్ణించారు. విజన్ స్వర్ణాంధ్ర-2047ను వికసిత భారత్-2047తో అనుసంధానించామని దీనిని ముందుకు తీసుకు వెళ్లడంతో.. మీ పాత్ర అత్యంత కీలకమని వారితో పేర్కొన్నారు. సమ్మిళిత సంక్షేమం, ఆర్థికవృద్ధి, మహిళా సాధికారతతోపాటు ప్రాంతీయ సమానత్వంతో సమర్థవంతమైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు.

సాంకేతికతను స్వీకరించి.. కరుణతో ముందుకు సాగాలని వారిని కోరారు. అలాగే జవాబుదారీతనంతో పని చేయాలంటూ సూచించారు. పాలన ద్వారా పౌరులను సంతృప్తిపరచడం ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొన్నారు. బాధ్యతతో ప్రజా కేంద్రకంగా పాలన సాగించేందుకు ఈ జిల్లా కలెక్టర్ల సదస్సు దోహదపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

కొత్తగా జిల్లా కలెక్టర్లుగా నియమితులైన వారికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. అలాగే వారందరికీ శుభాకాంక్షలు సైతం చెప్పారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఆయన ఆదేశించారు. అందుకోసం పూర్తిగా శక్తిని వియోగించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఆ క్రమంలో మీ అందరికీ తన పూర్తి మద్దతు ఉంటుందని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

ఈ మేరకు సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ఈ జిల్లా కలెక్టర్ల సమావేశం.. రెండు రోజుల పాటు జరుగుతుంది. సోమవారం ప్రారంభమైన ఈ సదస్సు రేపటితో అంటే మంగళవారంతో ముగియనుంది. అదీకాక.. గతం వారం రోజుల్లో రెండు సార్లు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు..
కాలేజీలు బంద్.. సీఎం రేవంత్ రియాక్షన్..
For More TG News And Telugu News