Arogyasri Services Halted In Telangana: నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు..
ABN , Publish Date - Sep 15 , 2025 | 02:47 PM
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో.. తెలంగాణలో మరోసారి ఆ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం నాడు హైదరాబాద్‌లో ప్రకటించింది. మంగళవారం.. అంటే సెప్టెంబర్ 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఆరోగ్య శ్రీ సేవల ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1400 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది.
ఈ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి సానుకూల ప్రకటన రాలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. నిధులు లేమి కారణంగా.. హాస్పిటల్స్ నడిపించే పరిస్థితి లేదని ప్రైవేట్ హాస్సిటల్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
బిల్లులు పొందాల్సిన జాబితాలో దాదాపు 400 హాస్పిటల్స్ ఉన్నట్లు సమాచారం. గత ఏడాదిగా హాస్పిటల్స్‌కు ప్రభుత్వం నగదు చెల్లించడం లేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. అయితే ఈ అంశంపై ఆగస్టు 31వ తేదీనే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశామని హాస్పిటల్స్ యాజమాన్యం తెలిపింది. ఆ రోజు అర్ధరాత్రి నుంచే సేవలు బంద్ చేస్తామని ప్రభుత్వాన్ని స్పష్టం చేశామని.. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి రంగంలోకి దిగి ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. అయినా ఇప్పటివరకూ నిధులు రాకపోవడంతో సమ్మెకు దిగబోతున్నట్లు వెల్లడించింది.
కానీ రెండు వారాలు గడిచినా.. ఆ నిధులు ఇప్పటి వరకు విడుదల చేయలేదని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో సైతం ఇదే విధంగా ఆరోగ్య శ్రీ సేవలను సదరు అసోసియేషన్ నిలిపివేసిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఓటర్లతో ముచ్చట పెట్టి.. అమలు కానీ హమీలు..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News