MLA: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైర్.. జగన్.. అసలు నీకు సిగ్గుందా..
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:57 PM
‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే.. అసెంబ్లీకి వస్తానంటున్న నీకు సిగ్గుందా..?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైరయ్యారు. ఆయన మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.
-ప్రతిపక్ష హోదా అడుక్కునేది కాదు.. ప్రజలు ఇచ్చేది
- ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైర్
అనంతపురం: ‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే.. అసెంబ్లీకి వస్తానంటున్న నీకు సిగ్గుందా..?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు(Madakashira MLA MS Raju) ఫైరయ్యారు. ఆయన మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా అడుక్కునేది కాదనీ, ప్రజలు ఇచ్చేదన్నారు. చంద్రబాబునాయుడు ఇచ్చేది కాదన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిని అడిగి అయినా.. జగన్‌కు కావాలంటే ఆ పోస్టు ఇప్పిస్తామంటూ రాజు ఎద్దేవా చేశారు.

ఇప్పటికే అన్నీ ఫిల్ చేశామనీ, జగన్ దరఖాస్తు చేసుకుంటే డైరెక్టర్ పోస్టు ఇస్తామన్నారు. రాయలసీమ గడ్డపైనే పుట్టి ఉండుంటే... జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. జగన్ ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలిగించమనీ, దమ్ము, ధైర్యం ఉంటే... అసెంబ్లీకి రావాలన్నారు. టీడీపీ, కూటమి ప్రభుత్వం, సూపర్ సిక్స్ పథకాలపై జగన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మద్యం కేసులో ఎంతోమంది అనంతపురం జిల్లా నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయన్నారు. త్వరలో నిగ్గు తేలిస్తే... జిల్లాకు పట్టిన దరిద్రం పోతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News