Kondareddipalli: సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:20 AM
సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత గ్రామం నాగర్‌కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో నాలుగు వరుసల రహదారి పనులు చురుగ్గా సాగుతున్నాయి..
కొండారెడ్డిపల్లిలో చురుగ్గా రహదారి పనులు
వంగూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత గ్రామం నాగర్‌కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో నాలుగు వరుసల రహదారి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ప్రహరీని కూడా తొలగించారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై గల కొండారెడ్డిపల్లి గేటు నుంచి కొండారెడ్డిపల్లి గ్రామం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు చేపట్టారు. 3.9 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారి నిర్మాణ పనులను రూ. 21 కోట్లతో 2024 సెప్టెంబరులో ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం ఈ నెల చివరి నాటికి పనులు పూర్తికావాలి. గ్రామం బయట బీటీ రోడ్డు వేశారు. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే నెల 2న దసరా పండుగకు సీఎం రేవంత్ కొండారెడ్డిపల్లికి వస్తుండడంతో ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఈ నెల 6న గ్రామానికి వచ్చిన కలెక్టర్ బదావత్ సంతోష్ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. దసరా నాటికి పనులు పూర్తికావాలని సూచించారు.