Share News

JC Prabhakar Reddy: తాడిపత్రి బాగు కోసమే దీక్ష..

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:27 AM

తాడిపత్రి పట్టణం అన్ని విధాలుగా బాగుండాలన్నదే తన అభిమతమని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం ఎంత ఖర్చు ఎంత అన్న విషయం ప్రజలకు తెలపాలని ఫ్లెక్సీని ఏర్పాటు చేశామన్నారు.

JC Prabhakar Reddy: తాడిపత్రి బాగు కోసమే దీక్ష..

- మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి(అనంతపురం): తాడిపత్రి బాగుకోసమే దీక్ష చేస్తున్నానని మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పట్టణంలోని స్థానిక పోలీస్‏స్టేషన్‌ సర్కిల్‌లో ఉన్న గాంధీ విగ్రహం ఎదురుగా గురువారం ఆయన దీక్ష చేయడం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. మున్సిపాలిటీ ఆస్తులను ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతోనే దీక్ష చేపట్టానన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష చేసినట్లు ఆయన తెలిపారు.


తాడిపత్రి మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం ఎంత ఖర్చు ఎంత అన్న విషయం ప్రజలకు తెలపాలని ఫ్లెక్సీని ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో ప్లాస్టిక్‌ ఎక్కడా లేదని చెత్తను గార్బేజీ వాహనాల్లోనే వేస్తున్నారన్నారు. 2026 సంవత్సరం చివరికల్లా తాడిపత్రిని నంబర్‌-1 మున్సిపాలిటీగా చేస్తానన్నారు.


pandu2.2.jpg

భూగర్భనీటి వ్యవస్థ ద్వారా వచ్చిన నీటిని శుద్ధిచేసి సమీపంలోని అర్జాస్‌ స్టీల్‌ప్లాంట్‌కు సరఫరా చేసి ఆదాయం సమకూర్చుతున్నామన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీకి 270ఎకరాలు ఆస్తి ఉందని వాటివిలువ దాదాపు రూ.2వేల కోట్లు అన్నారు. మున్సిపాలిటీ అద్దెరూముల ద్వారా దాదాపు రూ. 3కోట్లు వస్తుందన్నారు. శానిటేషన్‌ ద్వారా మరో రూ.25లక్షలు వచ్చేలా వనరులను సమకూర్చుతున్నామని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం

మరో 3.5 కిలోల బంగారం రికవరీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2026 | 11:27 AM