GAS CYLINDER EXPLODED: పేలిన గ్యాస్ సిలిండర్
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:58 PM
ప ట్టణ సమీపంలోని గ న్నెవారిపల్లికాలనీలో శనివారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘ టనలో 8 మంది గా యపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉం ది. గన్నెవారిపల్లికాలనీకి చెందిన జనార్దన, జ్యోతి దంపతులు.
ఒకరి పరిస్థితి విషమం
తాడిపత్రి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ప ట్టణ సమీపంలోని గ న్నెవారిపల్లికాలనీలో శనివారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘ టనలో 8 మంది గా యపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉం ది. గన్నెవారిపల్లికాలనీకి చెందిన జనార్దన, జ్యోతి దంపతులు. వీరు పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన వారు. బతుకుదెరువు కోసం గన్నెవారిపల్లికాలనీలో ఒక అద్దె ఇంటిలో మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి మగ్గం నేస్తుండగా బాత్రూంలో నుంచి గ్యాస్ లీకైన వాసన రావడంతో అనుమానంతో వెళ్లి చూశాడు. గీజర్‌కు ఉన్న గ్యాస్ లీకేజీ అయిందని గుర్తించి వెంటనే ఆర్పడానికి ప్రయత్నించాడు. సిలిండర్‌ను బాత్రూం బయటకు తీసుకువచ్చాడు. ఒక్కసారిగా మంటలు చూసిన భార్య జ్యోతితోపాటు, కుమార్తెలు చరిత, సరిత భయభ్రాంతులకు గురయ్యారు. ఎలాగైనా బిడ్డలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో జనార్దన సిలిండర్‌ను అక్కడే ఉంచి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఈ సమయంలో ఇంటిపైన ఉన్న యజమాని ఏకాంబరం వచ్చి చూశాడు. బయటకు వెళ్లాలని ఏకాంబరానికి చెబుతూ జనార్దన ఇంటిలోకి పరుగులు తీశాడు. వయసురీత్యా ఏకాంబరం బయటకు వెళ్లలేకపోవడంతోపాటు మంటలను ఆర్పే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కల వారు కూడా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. సిలిండర్ బయటకు తీసుకువచ్చిన కొద్దిసేపటికే అది పేలింది. మంటలను ఆర్పే క్రమంలో ఏకాంబరానికి తీవ్రగాయాలు కాగా జనార్దన, జ్యోతి, చరిత, సరిత, రాజేష్, నాగరంగయ్య, ప్రశాంతలకు గాయాలయ్యాయి. ఇంటిలోని సామగ్రి కాలిపోయింది. గాయపడ్డ వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. సమాచారం అందుకున్న ఫైరింజన అధికారులు, రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, చింబిలి ప్రసాద్‌నాయుడులు అనుచరులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరాతీశారు.