CHAIRMAN JCPR: టౌనబ్యాంక్‌ను కాపాడుకుందాం
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:43 PM
పట్టణంలోని టౌనబ్యాంక్‌ను కాపాడుకుందామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్ సమీపంలోని మాంగళ్య కమ్యూనిటీ హాలులో ప్రైవేట్ డాక్టర్ల అసోసియేషన ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు.
తాడిపత్రి, డిసెంబరు20(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని టౌనబ్యాంక్‌ను కాపాడుకుందామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్ సమీపంలోని మాంగళ్య కమ్యూనిటీ హాలులో ప్రైవేట్ డాక్టర్ల అసోసియేషన ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టౌనబ్యాంక్‌ను కాపాడాలంటే మీ అందరి సహాయ సహకారాలు అవసరమన్నారు. గతంలో బ్యాంక్‌ను భ్రష్టుపట్టించారని దానిని ఇప్పుడిప్పుడే బాగుచేస్తున్నామన్నారు. పట్టణంలోని పరిశ్రమల నిర్వాహకులు, పెద్దపెద్ద వ్యాపారులు సహాయ సహకారాలు అందిస్తే బ్యాంక్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మరింత లాభసాటిగా తెచ్చినట్లయితే చిరువ్యాపారులకు రుణాలు ఇచ్చే వీలుంటుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు షేర్‌క్యాపిటల్‌గా బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. ఈ క్యాపిటల్ వల్ల బ్యాంక్ మరింత అభివృద్ధి చెంది వచ్చే మార్చినాటికి లాభసాటిగా నడుస్తుందన్నారు. బ్యాంక్ మేనేజర్ వెంకటరమణమ్మ, అధ్యక్షుడు రాంప్రసాద్ పాల్గొన్నారు.