JC Prabhakar Reddy: వైసీపీ పాలనలో గేట్లకు గ్రీస్ పెట్టిన పాపానపోలేదు..
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:17 PM
వైసీపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. సుబ్బరాయసాగర్ ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీస్ పెట్టిన పాపానపోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
- వైసీపీ నిర్లక్ష్య ఫలితమే..!
- సుబ్బరాయసాగర్‌కు నీటి విడుదల ఆలస్యం
- తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం: గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సుబ్బరాయసాగర్‌కి నీటి విడుదలలో ఆలస్యమైందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) పేర్కొన్నారు. అనంతపురంలోని లక్ష్మీనగర్‌లో గల తన నివాసంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. సుబ్బరాయసాగర్ ప్రాజెక్ట్‌కి ఎప్పుడో నీరు రావాల్సిందన్నారు. గత వైసీపీ పాలకులు.. కనీసం గేట్లకు గ్రీస్ పెట్టిన పాపానపోలేదన్నారు. గేటు సమస్యతో ఈ దపా నీటి పంపిణీలో ఆలస్యమైందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే డ్యాంల గేట్ల మరమ్మతులకు నిధులు విడుదల చేసిందన్నారు.
ఉమ్మడి జిల్లాలోని డ్యాంల గేట్ల మరమ్మతుల బాధ్యతలను జలవనరుల నిపుణుడు కన్నయ్యనాయుడు వంటి వారికి అప్పగించాలన్నారు. టెండర్ల ద్వారా నిధులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్నారు. ఎంపీఆర్ సౌత్‌కెనాల్‌కు రూ.89 లక్షల నిధులతో మరమ్మతులు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఎంఆర్‌పీ నుంచి సౌత్ కెనాల్‌కి సజావుగా నీరు వెళ్తోందన్నారు. కాలువలో 280 క్యూసెక్కుల ప్రవాహం ఉంటేనే పుట్లూరు చెరువుకు నీరు చేరుతుందన్నారు. ఎగువ ప్రాంత రైతులు అనవసరంగా గేట్లు ఎత్తి నీరు వాడుకుంటున్నారన్నారు. ఈ విషయంపై అధికారులతో చర్చించామన్నారు. మరోసారి మాట్లాడి, నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

కేతిరెడ్డిపై ఫైర్...
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Kethireddy Venkataramireddy)పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. హెచ్చెల్సీ నీటిపై తుంపెర డీప్‌కట్ వద్ద జరిగిన ఘటనను తెలుసుకుని మాట్లాడాలన్నారు. తాడిపత్రిలోని నివాసంలో ఆయన మాట్లాడుతూ.. తుంపెర డీప్‌కట్ వద్ద కాలువకు అడ్డం వేసిందెవరన్న విషయం తెలుసుకోకుండా మాట్లాడడం మంచిదికాదన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం మంచిదే గానీ, వాస్తవాలు తెలిపి ఉండుంటే సంతోషించేవారమన్నారు. ధర్మవరం(Dharmavaram) ప్రాంతానికి చెందిన రైతులు అడ్డు వేగా.. కలెక్టర్ తీసి వేయించారన్నారు.
తద్వారా నీరంతా చిత్రావతి నదిలోకి వెళ్లిపోయిందన్నారు. ఏమీ తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ‘నీ చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కొడుకులు ఎక్కడికెళ్లారు? వచ్చి.. రాజకీయాలు చేయండి. మూడేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే చూస్తాం.. చేస్తాం.. అని చెప్పడం కాదు. అధికారం ఉన్నా.. లేకపోయినా ఒకేవిధంగా ఉండాలి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు మేం రాజకీయం చేశాం. మీ మాదిరి మూడేళ్ల తర్వాత చేస్తాం.. చూస్తాం.. అనలేదు. పదేళ్లుగా గన్‌మెన్ లేకుండా తిరుగుతున్నాం. మీరు గన్‌లు పెట్టుకుని తిరుగుతున్నార’న్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..
బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారా..
Read Latest Telangana News and National News