Home » Dharmavaram
మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చిందేందుకు మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం తాడిమర్రి మండలంలో అబాసుపాలవుతోంది. ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్ ఆధ్యక్షతన గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. అయితే ఈ సమావేశానికి పలు ప్రధాన శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.
పట్టణంలోని సాయినగర్ షిర్డీసాయి మంది రంలో దత్తాత్రేయ జయంతిని ఆలయకమిటీ ఆధ్వర్యంలో గు రువారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ విగ్ర హానికి ప్రత్యేక పూజలు చేశారు. దత్తహోమం, సా మూ హిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించా రు. రక్త దాన శిబిరంలో 30 మంది యువకులు రక్త దానం చేశారు. అన్నదానం చేపట్టారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆయన మాడియాతో మాట్లాడుతూ... పేర్నినాని లాంటి వాళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఆయన అన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ఆ యన బుఽధవారం పట్టణం లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్‌కు రెండు తెలుగురాష్ట్రాలూ సమానమే అన్నారు.
కౌశల్ సైన్స రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణంలోని బీఎస్ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి చరణ్‌తేజ్ ఎంపికైనట్టు పాఠశాల హెచఎం మేరివరకుమారి తెలిపారు. కొత్తచెరువులో నవంబరు 27న జరిగిన కౌశల్ సైన్స ప్రతిభాన్వేషణ జిల్లా స్థాయి పోటీలలో చరణ్‌తేజ్ ప్రతిభ కనబరచినట్టు తెలిపారు.
ప్రధానమంత్రి అవాస్ యోజన(పీఎంఏవై2.0) పథకం కింద జియోట్యాగింగ్ చేయని వారికి ఈ నెల 14 వరకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవా లని టీడీపీ నియోజవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ సూచించారు. పీఎంఏవై 2.0పై స్థానిక ఎర్రగుంట టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
వైసీపీ నాయకులు కూటమి నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన ధర్మవరంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఒక్కో ఓవర్‌కు ఒక్కో పందెం కాస్తున్నారు. పట్టణంలోని క్రీడా మైదానంలో జరిగే పోటీలు బెట్టింగ్‌లకు అడ్డాగా మారాయనే విమర్శలొస్తున్నాయి. ఇక్కడ జరిగే మ్యాచ్‌లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉంటాయి. వివరాలిలా ఉన్నాయి.
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని సోమవారం ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించారు. వైద్యాధికారులు, సిబ్బంది, మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మానవహారం ఏర్పాటుచేసి, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో ప్రతిపేద వాడి ముఖంలో ఆనందం కనిపిస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని 27వ వార్డు వైఎస్సార్ కాలనీలో ఎన్టీఆర్భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందజేశారు.