POLES: రోడ్డు పనులకు స్తంభాల ఆటంకం
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:04 AM
గతమంతా మట్టిరోడ్డుకే పరిమితమైన ఆ గ్రామానికి ఇటీవల కూటమి ప్రభుత్వం తారురోడ్డు మంజూరు చేసింది. దీంతో తమ ప్రయాణ కష్టాలు తీరు తాయని గ్రామస్థులు సంతోషిస్తున్నారు. అయితే అప్పట్లో రోడ్డు మధ్య లో ఏర్పాటు చేసిన విద్యుత స్తంభాలు పనులకు ఆటంకం కలిగి స్తా యనే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.
-మార్చాలని కోరుతున్న కత్తేకొట్టాల వాసులు
- విద్యుత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన
ధర్మవరం రూరల్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): గతమంతా మట్టిరోడ్డుకే పరిమితమైన ఆ గ్రామానికి ఇటీవల కూటమి ప్రభుత్వం తారురోడ్డు మంజూరు చేసింది. దీంతో తమ ప్రయాణ కష్టాలు తీరు తాయని గ్రామస్థులు సంతోషిస్తున్నారు. అయితే అప్పట్లో రోడ్డు మధ్య లో ఏర్పాటు చేసిన విద్యుత స్తంభాలు పనులకు ఆటంకం కలిగి స్తా యనే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి తారు రోడ్డే ఎరుగని చరిత్ర మండల పరిధిలోని కత్తేకొట్టాల గ్రామస్థులది. అ యితే మండలంలోని మోటుమర్ల నుంచి కత్తేకొట్టాల గ్రామానికి ఇటీ వల తారురోడ్డు మంజూరైంది. పనులు ప్రారంభించారు. అయితే గ తంలో గ్రామసమీపాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత స్తం భాలు ప్రస్తుతం రోడ్డుపనులకు ఆటంకంగా మారాయి. ఈ స్తంభాలను పక్కకు మా ర్చాలని విద్యుత అధికా రులతో మొరపెట్టుకున్నా పట్టించుకోవ డం లేదని గ్రామస్థులు
కత్తే పెద్దన్న, తిమ్మన్న, బన్యాల శివయ్య, గోపాల్ తది తరులు వాపోతున్నారు. పలుమార్లు స్థానిక విద్యుత కార్యాలయానికి వెళ్లి సమస్యను తెలియజేసినా అధికా రుల్లో చలనం రాలేదంటున్నారు. ఇన్నాళ్లకు తమ గ్రామానికి రోడ్డు మంజూ రైందని, స్తంభాలను రోడ్డు మధ్య నుంచి పక్కకు మార్చాలని ఎంత అడిగినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నా రు. ఇప్పటికైనా విద్యుతఅధికారులు నిర్లక్ష్యం వీడి స్తంభాలను పక్కకు మార్చి రోడ్డు పనులు సవ్యంగా జరిగేలా చూడాలని గ్రామస్థులు కో రుతున్నారు. ఈ విషయంపై మండల విద్యుతశాఖ ఏఈ జానకీరామ య్యను అడుగగా... విద్యుత స్తంభాలను పక్కకు మార్చాలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్తంభాలను పరిశీలిస్తామన్నారు. గ్రామ స్థులతో చర్చించి, సమస్యను పరిష్కరిస్తామని ఏఈ తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....